హోలగుంద మండల కేంద్రంలోని హెబ్బటం గ్రామంలో శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. దాదాపు 20 రోజులుగా యూరియా లభ్యం కాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరఫరాలో జాప్యం జరుగుతుందని, యూరియా పక్కదారి పట్టిందని రైతులు ఆరోపించారు. 50 ఎకరాల పంటలకు ఇప్పటివరకు ఒక్క బస్తా యూరియా కూడా అందలేదని అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.