నారాయణపేట జిల్లా కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం ముందు గురువారం ఉదయం మూడు గంటల నుండి యూరియా కోసం రైతులు బారులు తీసి లైన్ లో నిల్చున్నారు. బస్టాండ్ ముందు రైతులు రోడ్డుపై నిలిచి బస్టాండ్ నుండి బస్సులు బయటకు వచ్చే సమయంలో ఉదయం ఏడు గంటల సమయంలో బస్సులను అడ్డుకున్నారు.. రైతులకు యూరియా పంపిణీ చేయాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో యూరియా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రైతులకు యూరియా పంపిణీ చేయాలని కోరారు.