వరదలో చిక్కుకున్న డిగ్రీ కళాశాల విద్యార్థినులు మెదక్ జిల్లా రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో సుమారు 350 మంది విద్యార్థినులు వరద నీటిలో చిక్కుకుపోయారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హాస్టల్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. బుధవారం దీంతో విద్యార్థులు బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మధ్యాహ్న భోజనం లేకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. విద్యార్థులను బయటకు తీసేకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.