అనారోగ్య సమస్యలతో మనస్థాపానికి గురై నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్ తెలిపిన వివరాలు ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. మనస్థాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.