సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం లోని జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షల సేకరణ కేంద్రం వద్ద సోమవారం రోజు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. క్యూలైన్లతో పాటు ఓపి వద్ద స్లిప్పులు రిజిస్టర్ కాక కంప్యూటర్లు మొరాయించడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైద్యులు రిపోర్టులు కావాలని కోరుతున్న సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం అవుతుంది అన్నారు. ఓవైపు డిసిహెచ్ఎస్ఓ అధికారిపై వేటుపడిన పరిస్థితుల్లో మార్పు రాలేదని రోగులు వాపోతున్నారు. పై అధికారులు స్పందించి రోగులకు కనీస మౌలిక వసతులు వేగవంతం చేయాలని తెలిపారు.