ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు డివిజన్లోని విద్యుత్ శాఖ అధికారులకు జిల్లా విద్యుత్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డివిజన్లో విద్యుత్ బకాయిలు వెంటనే రికవరీ చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా విద్యుత్ సదుపాయాలు కల్పించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.