మందస మండలం, కొత్తూరు రైతు సేవా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎరువుల కోసం రైతులు ఆందోళన చేశారు. 60 రోజులు అయినా ఒక్కసారి కూడా యూరియా వేయలేదని కొంతమంది రైతులు అధికారులు ముందు వాపోయారు. దీనివల్ల తమ పంటలు నష్టపోయే పరిస్థితి ఉంటుందని తెలియజేశారు. ప్రభుత్వం సరఫరా చేస్తే ఇస్తామని అధికారులు బదులిచ్చారు. దీంతో రైతులు ఆవేదన చెందుతూ.. వెంటనే సరఫరా చేయాలని కోరారు.