కార్మిక చట్టాల రక్షణకై పోరాడటమే రమణకు మనమిచ్చే నివాళి అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు. శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట కార్మిక నాయకుడు TNV రమణ 3వ వర్ధంతి కార్యక్రమాన్ని సమ్మె శిబిరం వద్ద ఘనంగా జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాల రక్షణకై పోరాటం చేయడమే రమణకు మనమిచ్చిన నివాళి అని పేర్కొన్నారు కామ్రేడ్ అన్న కాగజ్నగర్ పట్టణంలో పేపర్ మిల్లులో ఉన్నత ఉద్యోగాన్ని వదిలేసి కార్మికుల కోసం పోరుబాటు పట్టారని అన్నారు. ఎర్రజెండా చేతిలో పట్టి కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారని పేర్కొన్నారు.