ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళా పోలీసులతో ఎస్సై నాగమల్లేశ్వరరావు సోమవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాలపై వివరాలు సేకరించాలని ఎస్సై మహిళా పోలీసులకు తెలిపారు. విగ్రహాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని అంతేకాకుండా ఆ ప్రాంతంలో నిబంధనలను పాటిస్తూ విగ్రహాలు ఏర్పాటు చేశారు లేదో నిరంతరం నిఘా పెట్టాలని మహిళా పోలీసులకు ఎస్సై నాగమల్లేశ్వరరావు సూచించారు.