ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె బ్రహ్మ కుమారి ఈశ్వరియ విశ్వ విద్యాలయంలో సోమవారం GST అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెలూన్లు, జిమ్‌లు, క్రీడాసామగ్రిపై కొత్త జీఎస్టీ స్లాబుల గురించి వినియోగదారులకు వివరించారు. సెట్కూరు CEO డా. వేణుగోపాల్ మాట్లాడుతూ ఆరోగ్య, వ్యక్తిగత బీమాలపై GST ఉండదని, జిమ్ ఫీజు మరియు క్రీడాసామగ్రిపై GST 18% నుండి 5%కు తగ్గిందని తెలిపారు. స్టేట్ GST డిప్యూటీ కమిషనర్ నిర్మల, MPDO రమణ కరపత్రాలు పంపిణీ చేసి, ర్యాలీ నిర్వహించారు.