గంగానమ్మ సంబరం.. కట్టు కట్టడంలో వివాదం స్తానిక పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం రామవరపు మోడీ గ్రామంలో ఐదేళ్లకు ఒకసారి జరిగే గంగానమ్మ సంబరం సందర్భంగా మంగళవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో వివాదం చెలరేగింది. ఊరి పొలిమేరలోని పోతురాజు దిమ్మల వద్ద పరదేవతలు లోపలికి రాకుండా కట్టుకట్టించే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సమాచారం అందుకున్న ఆర్డీఓ స్వాతి, డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించి, వివాదాన్ని పరిష్కరించారు.