బాన్సువాడ మండలం బోర్లం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు సిపిఎస్ విద్రోహ దినాన్ని నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎస్ జి టి యు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు సిపిఎస్ పెన్షన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారని ఎందుకు నిరసనగా ఒకటవ తేదీన లక్ష మంది ఉద్యోగులతో నిరసన చెప్పటం ఉన్నట్లు ఆయన వెల్లడించారు.