తిరుపతి నుంచి రాజంపేట కు వస్తున్న బస్సు శెట్టి గుంట వద్ద ప్రయాణికులు డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనకు నిరసనగా రాజంపేట ఆర్టీసీ ఆవరణలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు విధులకు హాజరు కాకపోవడంతో డిపోకు పరిమితమైన బస్సులు దానితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.