లో లెవెల్ కల్వర్టుపై ప్రమాదకరంగా వరద నీరు.. నిలిచిపోయిన రాకపోకలు... కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం దంచి కొడుతుంది.గన్నేరువరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గుండ్లపల్లి దేవుని చెరువు మత్తడి ప్రవాహం పెరిగి లో లెవెల్ కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో గుండ్లపల్లి నుంచి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామపంచాయతీ సిబ్బంది కల్వర్టుకు ఇరువైపులా కర్రలను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంత ప్రజలు అటువైపు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వర్షాలు పడ్డ ప్రతిసారి రాకపోకలకు ఇబ్బంది కలుగుత