నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరం పట్నంలో అన్నా క్యాంటీన్ భవనానికి సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్నారై సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు తక్కువ ధరకే అల్పాహారం భోజనం అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ పి.వి. గోపాల్రాజు,టిడిపి నాయకులు వైకుంఠం ప్రదీప్ కుమార్, సొసైటీ అధ్యక్షులు లంక బంగారు నాయుడు,గంట్యాడ మండల టిడిపి అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.