చల్లపల్లికి చెందిన రోడ్డు ప్రమాద క్షతగాత్రుడు అమానుల్లా షరీఫ్ (30) సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆగస్టు 20వ తేదీ మచిలీపట్నం ఫరీద్ బాబా దర్గాకు చల్లపల్లి నుంచి కాలి నడకన వెళ్లి తిరిగి వస్తుండగా రాత్రి వేళ జాతీయ రహదారి-216పై ఘంటసాల మండలం లంకపల్లి వద్ద ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయంతో విజయవాడలో చికిత్స పొందుతూ షరీఫ్ మృతి చెందాడు.