శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని గాండ్లపెంట ఎన్పీ కుంట మండలాలలోని పలు గ్రామాలలో ఆదివారం వినాయక నిమర్జనాన్ని నిర్వహించారు. ఐదు రోజులపాటు విశేషంగా పూజలు అందుకున్న గణనాధులను కమిటీ నిర్వాహకులు ట్రాక్టర్లలో కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహించారు. ఆదివారం రాత్రి వరకు నిమజ్జనం వైభవంగా కొనసాగింది. యువత నృత్యాలు చేసుకుంటూ గణనాథులను సాగనంపారు.