పల్నాడు జిల్లా నరసరావుపేటలోని లింగంగుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యంగ విద్యార్థుల కోసం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత ఉపకరణాల పంపిణీ నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఈ శిబిరాన్ని సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాలల్లో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయన తెలిపారు.