పెంచికల్పేట్ మండలంలోని అగర్ గూడా గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 సంవత్సరాల నుండి ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నామని ఈ గ్రామంలో ఇల్లు నిర్మించడానికి పర్మిషన్ లేదని అటవీశాఖ అధికారులు తమను వేధిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు,