హెచ్ఐవి ఎయిడ్స్‌పై అందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. అనిత తెలిపారు. శనివారం యూత్ ఫెస్ట్ - 2025 యూత్ హెచ్‌ఐవి/ఎయిడ్స్‌పై యువతకు ఐఈసి మారథాన్ 5కె రెడ్ రన్ 80 ఫీట్ రోడ్డు, వాంబే కాలనీ నుండి మిల్లు జంక్షన్ వరకు తిరిగి మిల్లు జంక్షన్ నుండి వాంబే కాలనీ వరకు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. హెచ్ఐవి /ఎయిడ్స్ సంక్రమణ సెక్స్ పద్దతి ద్వారా, సురక్షితంకాని సెక్స్, రక్తమార్పిడి, సిరంజీల మార్పిడి వలన ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమణ జరుగుతుందన్నారు. హెచ్ఐవి /ఎయిడ్స్ వ్యాప్తి పై అందరూ అవగాహన కలిగి, వ్యాప్తిని తగ్గించగలగాలన్నారు.