ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దొడ్డంపల్లె గ్రామంలో సోమవారం వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల తరలింపు నేపథ్యంలో ఇది వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘర్షణకు కారణమైన 21 మందిపై కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ సురేష్ మీడియాకు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించి గొడవలకు కారణమయ్యే వారిని చట్టపరంగా శిక్షిస్తామని సీఐ సురేష్ ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు.