శ్రీకాకుళం నగరంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకు మొదటి విడతగా 25 కేజీలు, రెండో విడతగా 25 కేజీలు, మూడో విడతగా 25 కేజీలు మొత్తం 75 కేజీల యూరియా అందజేస్తామని అన్నారు.. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఎకరాకు భూమి ఉన్న రైతుకు గాని భూమి సాగు చేస్తున్న కవులు రైతుకు గాని ప్రతి ఒక్క ఎకరాకు యూరియా ఇచ్చే పూర్తి బాధ్యత తాము తీసుకుంటామని ఆయన తెలియజేశారు...