ఏలూరు జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగులు బంధువులు రోగుల ఆందోళన చేపట్టారు.అనారోగ్యంతో సూర్యనారాయణమ్మ అనే వృద్ధురాలు ఆసుపత్రిలో చేరింది.వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్రెయిన్ లో క్లాట్స్ ఉన్నాయని ఉన్నాయని తెలిపారు. వెంటనే ఆసుపత్రిలోని న్యూరో సర్జన్ విద్యాసాగర్ కు రిఫర్ చేశారు.బాధితురాలి బంధువులు సిటీ స్కానింగ్ రిపోర్ట్ పట్టుకుని న్యూరో సర్జన్ వార్డుకు వెళ్లి డాక్టర్ విద్యాసాగర్ ను సంప్రదించగా వృద్ధురాలుకి వయసు అయిపోయింది ఇంకా వైద్యం ఎందుకని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు.