రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిధున్ రెడ్డిని వైఎస్ఆర్సిపి నేతలు బుధవారం కలిశారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపీ మిధున రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, న్యాయ వ్యవస్థ ఇంకా నిర్ధారించలేదని అన్నారు.. ప్రభుత్వం కేసులు పెట్టినంతమాత్రాన అందరూ దోషులు కారని న్యాయవ్యవస్థని ధరించే వరకు వ్యక్తిగానే చూడాలని ఆయన పేర్కొన్నారు.. మిధున రెడ్డి కుటుంబానికి చిత్తూరు జిల్లాలో మంచి సంబంధాలు ఉన్నాయని,చార్జిషీట్ వేయడం లేదని ఆయన మండిపడ్డారు..