స్మార్ట్ రేషన్ కార్డులు ద్వారా రేషన్ సరుకులు పంపిణీ పారదర్శకంగా, మెరుగ్గా జరుగుతుందని ఏపీ అప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. బుధవారం భీమడోలు పంచాయతీఆఫీస్, గ్యాస్ కంపెనీ రోడ్డులోని లబ్దిదారులకు కూటమి నాయకులతో కలిసి గన్ని స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని, హామీలను అమలు చెయ్యడమే కాకుండా చెప్పని హామీలు కూడా అమలు చేస్తున్న ఘటన కూటమి ప్రభుత్వందన్నారు.