కథలాపూర్ మండలం చింతకుంట గ్రామస్థులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ను శనివారం కలిశారు. గ్రామంలో నిర్వహించే సత్యానంద ఆశ్రమ స్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు అందించామన్నారు. సత్యానంద ఆశ్రమం పీఠాధిపతి విశోఖ తీర్థ స్వామి, భక్తులు చిన్న మల్లయ్య, శశి, విష్ణు, రాజు ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు.