ప్రకాశం జిల్లా దోర్నాల నల్లమల అడవి ప్రాంతంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎక్కువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు రావడంతో మండలంలోని పెద్ద బొమ్మలాపురం గండి చెరువుకు జలకల సంతరించుకుంది. చెరువుకు భారీగా వర్షం నీరు చేరడంతో పలు గ్రామాల ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే రాళ్లవాగు ఉదృతంగా ప్రవహిస్తే చెరువు అలుగు పారే అవకాశం ఉందని రైతులు తెలిపారు.