కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాణిక్యం పటాన్చెరు పారిశ్రామికవాడలో నిర్వహించారు. సర్వే కార్యక్రమంలో కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. దసరా పండుగ వరకు కార్మికులకు బోనస్ చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.