రైతులకు యూరియా పంపిణిలో ఎలాంటి ఇబ్బదులు తలేత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.గురువారం జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి రైతులకు యూరియా సరఫరా,సాగు నీటిపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో అధికారులు ప్రణాళిక బద్ధంగా తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు.