మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు పురస్కరించుకొని, జగ్గంపేటలో సున్ని జామియా మసీద్ ఆధ్వర్యంలో మిలాన్ ఉన్ నబీ వేడుకల సందర్భంగా శుక్రవారం ఊరేగింపు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెడుని విడనాడి మనిషి సన్మార్గంలో నడిపించిన మహమ్మద్ ప్రవక్త బోధనలు ఆచరణ యోగ్యమన్నారు. అంతేకాకుండా ప్రపంచంలో శాంతి పూర్వక మానవ సమాజాన్ని నెలకొల్పేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త అని కూడా పేర్కొన్నారు.