అనంతపురం నగర శివారులోని జాతీయ రహదారిపై ఉన్న మనీపాల్ పాఠశాల వద్ద చెట్టుకురేసుకుని కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో గమనించిన స్థానికులు విషయాన్ని పోలీసులకు అందించడంతో సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడు గుంతపల్లి కి చెందిన అనిల్ గా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.