ఖైరతాబాద్ మహాగణపతిని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గురువారం మధ్యాహ్నం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించి మాట్లాడుతూ గణేష్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన ఖైరతాబాద్ గణేష్ వద్ద జరుగుతున్న ఏర్పాటును పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలవకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు.