పార్వతీపురం మండలం జిల్లా సీతంపేట ఏజెన్సీలో సోమవారం సుమారు 18 అడుగులు నల్లత్రాచు హల్చల్ చేసింది. ఒక నర్సరీలో కింగ్ కోబ్రా కనిపించడంతో అక్కడివారు భయపడి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ కాంతోపాటు రేంజ్ ఆఫీసర్ రామారావు, బీట్ ఆఫీసర్లు దాలినాయుడు, ప్రభాకర్, నీలవేణి తదితరులు అక్కడికి చేరుకొని పామును బంధించి సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇది తోటి పాములను తిని బ్రతుకుతుందని తెలిపారు. దీన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.