Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న సైన్స్ ఉపాధ్యాయుడు రాజేందర్ పై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేలంటూ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు వినతి పత్రం అందించి అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు దళిత సంఘాలనాయకులు చంద్రమౌళి,రవీందర్, బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తి విచారణ జరపకుండా రాజేందర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టడాన్ని దళితసంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగాఖండిస్తున్నామని,పాఠశాలలో పనిచేస్తున్న అందరినిఅదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరిపి రాజేందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.