రేపు సెప్టెంబర్ 8న వికలాంగుల, వితంతువుల చేయూత పెన్షన్ లబ్ధిదారులతో కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని VHPS రాష్ట్ర నాయకులు మంచోజూ చంద్రమౌళి అన్నారు. నేడు ఆదివారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో వారు అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ జిల్లా వృద్ధులు వితంతువులు వికలాంగుల పింఛన్ పెంపుదలకై నిర్వహించ తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యాలయాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.