భీమవరం పట్టణంలోని యూటీఎఫ్ భవనం, జన విజ్ఞాన వేదిక 18వ మహాసభలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి పాల్గొని మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం యుటిఎఫ్ కార్యాలయం ముందు గాజు పెంకులపై నిల్చొని మూఢనమ్మకాల నమ్మవద్దని ప్రజలకు సూచించారు. జన విజ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు.