కుందుర్పి లోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో శనివారం రెవెన్యూ అధికారులు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ ఓబులేసు స్వీపర్ చేతపట్టి రెవెన్యూ కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు. తహశీల్దార్ ఓబులేసుతోపాటు సిబ్బంది కూడా పరకలు చేత పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.