ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద ముంపుకు గురైన జిఆర్ కాలనీల్లో తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఎస ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి 3 వేల రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు... ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు..వరదల కారణంగా వారి పిల్లల పుస్తకాలు కొట్టుకుపోవడంతో పిల్లలకు అవసరమైన పుస్తకాలకు సైతం రెండు రోజుల్లో అందజేస్తామని SR ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కామారెడ్డి లో ఇలాంటి విపత్తు రావడం చాల బాదకారం అన్నారు.అనంతరం కాలని వాసులు ఎస్ ఆర్ పౌండేషన్ ప్రతినిధులకి కృతజ్ఞతలు తెలిపారు.