చిత్తూరు: విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించడమే లక్ష్యమని హెచ్ఎం భాను ప్రభఅన్నారు. గురువారం వరదప్పనాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్ధాలపై చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి ప్రభావంతో యువత చెడిపోతున్నారన్నారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు.