గుత్తిలో స్టోర్ కేటాయింపు విషయంలో శుక్రవారం టీడీపీ కి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 24 వ వార్డు స్టోర్ తమ వర్గానికి కేటాయించాలని వాసు -చౌదరి వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగారు. అనంతరం ఇరువర్గాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్లో ఇరువర్గాలతో పోలీసులు చర్చిస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన అనుచరులు భారీగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీసులు స్టేషన్లో నుంచి అందరినీ బయటకు పంపించారు.