నెల్లూరు జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న రౌడీ శీటర్లపై నెల్లూరు జిల్లా పోలీసులు దృష్టి పెట్టారు. ఘర్షణలకు దూరంగా ఉండాలంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలకు అవగాహన కల్పిస్తూనే.. రౌడీ షీటర్ల వివరాలు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు ఎక్కడున్నారని ఆరా తీస్తున్నారు. పాత కేసుల్లో అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్లో పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్లో న