అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలో భారతీయ సరుకుల దిగుమతిపై 50శాతం సుంకాలు విధించడాన్ని వామపక్షపార్టీలు తీవ్రంగా ఖండిస్తూ, ట్రంప్ సుంకాలను తక్షణమే రద్దుచేయాలని, సుంకాలపై మోడీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ప్రభుత్వాల వైఖరి వెల్లడిరచాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.మణి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.రెహ్మన్‌లు డిమాండ్ చేసారు. ట్రంప్ సుంకాలను వ్యతిరేకిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చిన నేపధ్యంలో జివిఎంసి గాంధీవిగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు సిపిఐఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు అధ్యక్షత వహించారు.