వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని వికారాబాద్ నస్కల్ రోడ్డు మార్గాం మొత్తం గజానికో గుంత గా మారింది. గత కొన్ని రోజులుగా వర్షాలు పడడంతో ఆ గుంతలు భారీగా ఏర్పడి వాహన దారులు ప్రమాదాలకు గురై గత కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి కూడా ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి మృతి చెందిన సంఘటన జరిగాయని, ఎంతోమంది వాహనదారులు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చేరినట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డును మరమ్మత్తు చేయాలని పలువురు కోరారు