కాగజ్నగర్ రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎస్ కె శ్రీవత్సవ శనివారం సందర్శించారు. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ కు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. ప్లాట్ఫార్మ్ నెంబర్ మూడును అభివృద్ధి చేయాలని టికెట్ కౌంటర్ పెట్టాలని టాయిలెట్లు నిర్మించాలని కోరారు. కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించి మూడు ఫ్లాట్ ఫంలకు ఓకే లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కోరునట్లు ఎమ్మెల్యే పాల్వాయి తెలిపారు,