జులూరుపాడు మండలం పాపకొల్లు బీట్ పరిధిలోని ఫారెస్ట్ భూముల్లో ఛత్తిష్ ఘడ్ రాష్ట్రానికి చెందిన గుత్తికోయలు పోడు వ్యవసాయం చేస్తూ ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో మొక్కలు పీకి ప్లాంటేషన్ పనులు చేస్తుండడంతో గుత్తికోయలు సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విజయలక్ష్మి పై దాడికి పాల్పడ్డారు. వారి వెనుక స్థానికంగా పాపకొల్లు గ్రామానికి చెందిన ఒకవ్యక్తి వారిని రెచ్చగొట్టి తమపై ఉసిగొల్పినట్లు విజయలక్షి తెలిపారు. పలుమార్లు హెచ్చరించిన ఆపకుండా వ్యవసాయం చేస్తుండడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని తొలిగించి మొక్కలు నాటుతున్న క్రమంలో తనపై దాడి చేశారని, అన్నారు