ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొట్టిన అంబులెన్స్.. గాయాలతో బయటపడ్డ బైకర్... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది.శనివారం మద్య్హనం ద్విచక్ర వాహనదారుడిని అంబులెన్స్ ఢీకొనడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మండలంలోని మక్త గ్రామానికి చెందిన చిట్యాల వాసు తాడికల్ గ్రామం నుండి మక్త గ్రామానికి వెళ్తుండగా వెనకనుంచి అంబులెన్స్ ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.