ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఈనెల 23న వృద్ధ దంపతులపై దాడి చేసి భారీగా బంగారం నగదుపోలీస్ లు అరెస్టు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా ఎస్పీ శివ కిషోర్ మాట్లాడుతూ లక్కవరంలో ఇంటి రాబరికి సంబంధించి ఐదుగురు నిన్నితులపై కేసు నమోదు చేశామని నలుగురు నిందితులను అదుపులో తీసుకున్నామని అన్నారు ఒకరు పరారీలో ఉన్నారని అన్నారు నిందితుల వద్ద నుంచి 246 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనపరుచుకున్నామని తెలిపారు