ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వంతెన వద్ద గోదావరి నదిలో గణనాధుల నిమజ్జనం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. సబ్ డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి గణపతి విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనానికి తరలిస్తున్నారు.