ఆదోని మండలంలోని పెద్దహరివాణం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఆదోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, పెద్దహరివాణం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉండి, పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, కాబట్టి మండలంగా ఏర్పాటు చేయాలని కోరారు.ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు క్రమంలో పెద్దహరివాణం మండల కేంద్రంగా ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిటీ సమావేశంలో గ్రామ ప్రజల గళాన్ని బలంగా వినిపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజ