యువత స్వశక్తితో ఎదిగి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు.నగరంలోని నాగావళి హోటల్ లో శనివారం నిర్వహించిన ఏంపవరింగ్ స్ట్రాప్స్, బిజినెస్ ఓనర్స్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న తరహా వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైైనర్ ను సిద్ధం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ వారికి కావలసిన అన్ని ప్రోత్సాహకాలు,శిక్షణ అందజేయడం జరుగుతుందని వివరించారు. వ్యాపారం ప్రారంభించే వారికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి.